11 May, 2026 | 3:40 AM

గాలివాన బీభత్సం..

11-05-2026 01:52 AM
  1. కొట్టుకుపోయిన ఇళ్ల పైకప్పులు
  2. విరిగిన విద్యుత్ స్తంభాలు, నేలకొరిగిన వృక్షాలు

ములకలపల్లి,మే 10 (విజయక్రాంతి): ములకలపల్లి మండలంలో శనివారం అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. గాలివానకు తాటాకుల, రేకుల ఇళ్లపైనున్న  పైకప్పులు లేచిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. వృక్షాలు నేలకూలాయి. మండలంలోని సీతారాంపురం పంచాయతీ అన్నారం గ్రామంలో పర్షిక సాంబశివబాలరాజుకు చెందిన రేకుల ఇల్లు నేలమట్టమయింది. పైకప్పు గాలి వానకు లేచిపోయి రేకులన్నీ విరిగిపోయాయి.తీవ్ర ఆర్థిక నష్టం జరిగింది.

విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో మండలంలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొత్త స్తంభాలను ఏర్పాటు చేసి  విద్యుత్తును పునరుద్ధరించేందుకు విద్యుత్ సిబ్బంది క్షేత్రస్థాయిలో తీవ్రంగా శ్రమించారు. రహదారుల వెంబడి ఉన్న చెట్లు రోడ్లపై వాళ్లంతా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.గ్రామ పంచాయతీల బాధ్యులు సిబ్బంది రోడ్లపై పడిన చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వరి ధాన్యం తడిసింది.

కొనుగోలు కేంద్రాల్లో దాన్యం కాంటాలు వేసి 15 రోజులవుతున్న అధికారులు లారీలను పంపకపోవడంతో బస్తాల్లో నింపిన ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గాలి వాన సృష్టించిన బీభత్సానికి రేకుల ఇల్లు నేలమట్టమయి నిరాశ్రయుడిగా మారిన బాధితుడు సాంబశివరాజుకు సీతారాంపురం గ్రామ సర్పంచ్ కుంజా రవి రూ 5000  ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ అకాల గాలివాన ములకలపల్లి మండలంలో విధ్వంసం సృష్టించింది.