23-08-2025 12:51:41 AM
మరోసారి ఏకగ్రీవంగా ఎన్నిక
హైదరాబాద్, ఆగస్టు (విజయక్రాంతి): కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన సీపీఐ రాష్ట్ర సభల్లో కార్యదర్శిగా కూనంనేని పేరును పల్లా వెంకట్‌రెడ్డి ప్రతిపాదించగా దానిని మిగతా వారు బలపరిచారు. దీంతో కూనంనేని సాంబశివరావు వరుసగా రెండోసారి కూడా సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మూడేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం కూనంనేని కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఉన్నారు.