23-08-2025 02:27:44 PM
ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు
అలంపూర్: సిపిఐ అగ్ర నాయకులు నల్గొండ మాజీ పార్లమెంటు సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి విలువలతో కూడిన రాజకీయాలకు నిలువుటద్దమని ఆయన పోరాట స్ఫూర్తి నిబద్ధత అందరికి స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి(MLC Challa Venkatrami Reddy), ఎమ్మెల్యే విజయుడు(MLA Vijayudu) అన్నారు. సురవరం పట్ల సంతాపాన్ని తెలిపారు. నా జీవితాన్ని ప్రజల కోసం పేదల అభ్యున్నతి కోసం అంకితం చేశారని తెలంగాణ రాజకీయాలకు, కమ్యూనిస్టు ఉద్యమానికి తీరనిలోటని కొనియాడారు. పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.