calender_icon.png 23 August, 2025 | 6:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పశువుల రవాణా చేస్తున్న వాహనం స్వాధీనం

23-08-2025 02:30:55 PM

కాగజ్ నగర్ (విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం లగ్గం ఎక్స్ రోడ్డు వద్ద శనివారం జిల్లా టాస్క్ ఫోర్స్ బృందం తనిఖీ చేపట్టారు. బొలెరో వాహనంలో ఆరు పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇలియాస్ నవాబ్ ఖురేషి, మొహమ్మద్ రహ్మత్, షకీల్ ఖురేషి, ఫరీద్ లను అరెస్ట్ చేసి, వాహనాలు సీజ్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. టాస్క్ ఫోర్స్ సీఐ రానా ప్రతాప్(Task Force CI Rana Pratap) మాట్లాడుతూ... జిల్లా పరిధిలో అక్రమ కార్యకలాపాలు, ముఖ్యంగా పశువుల అక్రమ రవాణా, స్మగ్లింగ్, గ్యాంబ్లింగ్, చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చట్టాన్ని అతిక్రమించేందుకు ప్రయత్నిస్తే కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ తనిఖీలు ఎస్‌ఐ రాజు, హెడ్ కానిస్టేబుల్ మహమూద్, కానిస్టేబుల్స్ విజయ్, మధు, రమేష్, స్పెషల్ పార్టీ కానిస్టేబుల్స్ సాయి, తమ్షీర్ ఖాన్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.