calender_icon.png 7 September, 2025 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చినుకు పడితే ఎర్రుపాలెం రోడ్లన్నీ జలమయం

02-09-2025 12:00:00 AM

ఎర్రుపాలెం సెప్టెంబర్1( విజయ క్రాంతి): మండల కేంద్రమైన ఎర్రుపాలెం లో చినుకు పడితే రోడ్లన్నీ జలమయంగా మారుతున్నాయి. ప్రధాన రహదా రీ అయినా హై స్కూల్ నుండి ఆంజనేయస్వామి గుడి వరకు  చినుకుపడితే గుంతలుగా మారి రోడ్లమీద నీళ్ల ప్రవాహం కనిపిస్తుంది. శివాలయం పక్కన ఉన్న రోడ్డు కూడా చినుకు పడితే వాగు లాగా ఏర్పడి నడవడానికి వీలు లేకుండా భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు.

ముత్యాలమ్మ గుడి దగ్గర చినుకు పడితే గుంటలలో నీళ్లు చేరి రహదారి మీదికి ప్రవహిస్తున్నాయి. ముత్యాలమ్మ గుడి కి రోజు భక్తులు దర్శనం కొరకు  వస్తుంటారు. గుడి చుట్టూ నీరు నిల్వ ఉండడంతో భక్తులు అనేక రకాల ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది .దీనివలన రోడ్లమీద నడిచే వెళ్లే వారికి అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. గుంతలలో నీరు పొంగి డ్రైనేజీ కాలువలు లేకపోవడం వలన సమీప ఇండ్లలోకి నీరు వచ్చి చేరుతుంది.

ఇండ్ల లో నివసించేవారు బయటకు రావడానికి అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. .ఈ గుంతలలో నీరు నిండటం వలన దోమలు పెరిగి అనేక రకాల వ్యాధులు కు ప్రజలు గురవుతున్నారు. గుంటలలో నీళ్లు నిలువ ఉండటం వలన రకరకాల పాములు సమీప ఇండ్లలోకి రావడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రభుత్వ అధికారులు చొరవ చూపి గుంతలను పూడ్చడం వలన నీరు నిలవకుండా చూడాలని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.