18-12-2025 07:40:42 PM
ఉప్పల్ (విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం డివిజన్లోని భవాని నగర్ ఓల్డ్ విలేజ్ ఎర్రకుంట కాలనీలో సుమారు 71 లక్ష రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి స్థానిక కార్పొరేటర్ శాంతి సాయిజెన్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేవలం రెండు నెలల కాలంలోనే సుమారు 9 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు.
నాచారం రైతు బజార్ పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంలో పేద మధ్యతరగతి ప్రజలు శుభకార్యాలు చేసుకోవడానికి వీలుండేలా మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ తొందర్లోనే నిర్మిస్తామని ఆయన తెలిపారు. మంజూరైన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇంజనీర్ బాలకృష్ణ అసిస్టెంట్ ఇంజనీర్ వినీత్ వర్క్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు పాల్గొన్నారు.