27-10-2025 07:20:02 PM
సనత్‌నగర్,(విజయక్రాంతి): ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. సనత్ నగర్ లోని అల్లా ఉద్దిన్ కోటి లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచన మేరకు ఆమ్ స్టర్ ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్ష శిబిరాన్ని సోమవారం ఏర్పాటు చేయగా, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై ప్రారంభించారు.
ఈ శిబిరంలో ఆయన కంటి పరీక్షలు చేయించుకున్నారు. పేద ప్రజలు అధికంగా నివసించే ప్రాంతాలలో నిర్వహించే వైద్య శిభిరాలతో పేదలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. బస్తీలోని ప్రజలు సద్వినియోగం చేసుకునే విధంగా చొరవ తీసుకోవాలని బస్తీ నాయకులకు ఆయన సూచించారు. శిబిరానికి వచ్చిన వైద్యులు, సిబ్బందికి కొలన్ బాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో సనత్ నగర్ డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, నాయకులు ఖలీల్, శేఖర్, పురుషోత్తం, బస్తీ నాయకులు కరీం లాలా, ఫాజిల్, వైద్యులు శిరీష, లలిత్, సమీరా తదితరులు పాల్గొన్నారు.