13-10-2025 05:15:01 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా లక్ష్మణ చందా మండలం వడ్యాల్ ఉన్నత పాఠశాలలో సోమవారం ఎస్జీఎఫ్ 69వ అండర్-14 జిల్లా స్థాయి కబడ్డీ క్రీడాకారుల ఎంపిక పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న ఈ పోటీలను ప్రారంభించి జిల్లా స్థాయిలో బాల బాలికల జట్లను ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఎంపికైన క్రీడాకారులు జోనల్ స్థాయిలో పాల్గొనవలసి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ జి ఎఫ్ కార్యదర్శి రవీందర్ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.