calender_icon.png 13 October, 2025 | 8:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన ఆదర్శ విద్యార్థిని సాత్విక

13-10-2025 05:36:02 PM

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా బహుమతి ప్రధానం..

కాటారం (విజయక్రాంతి): హైదరాబాద్ లోని డా.మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్ హెచ్ఎర్డీ) లో ఆదివారం జాన్సన్ పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి టాలెంటోత్సవ్-2025లో కాటారం మండల కేంద్రంలోని ఆదర్శ హైస్కూల్ విద్యార్థిని కే.సాత్విక తన ప్రతిభ చాటింది. పప్పెట్ షో విభాగంలో విజేతగా నిలిచి మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అవార్డు, మెడల్, సన్మానం అందుకుంది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 2500 మంది విద్యార్థులు పాల్గొన్న జాతీయ స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి గ్రామీణ ప్రాంతానికి చెందిన ఆదర్శ హైస్కూల్ 8వ తరగతి విద్యార్థిని సాత్విక విజేతగా నిలవడం పట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముఖ్య సలహాదారుడు రామ్ కమల్, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు అకెళ్ల రాఘవేంద్ర, డాక్టర్ రాధాలు ప్రత్యేకంగా అభినందించారు.

దేశవ్యాప్తంగా పట్టణాలలోని ప్రముఖ స్కూల్స్ నుంచి విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీల్లో జాతీయ స్థాయిలో సాత్విక విజేతగా నిలిచేలా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు బీఏరావు, అక్బర్, లావణ్యలను, ప్రోత్సహించిన తల్లిదండ్రులు కోమల, కుమారస్వామిలను ఆదర్శ విద్యాసంస్థల చైర్మన్ జనగామ కరుణాకర్ రావు, కరస్పాండెంట్ కార్తీక్ రావు, ప్రిన్సిపాల్ కృషితలు అభినందించి సన్మానించారు. ఆదర్శ విద్యార్థులను చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దడం వల్లనే ఇలాంటి విజయాలు సాధ్యమవుతున్నాయని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జాన్సన్ పబ్లికేషన్స్ ఎండీ చంద్రశేఖర్, ప్రతినిధులు అనంత లక్ష్మీ, సాయిశాంత్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.