13-10-2025 05:10:42 PM
యాదగిరిగుట్ట (విజయక్రాంతి): యాదగిరిగుట్ట యాదాద్రి దేవాలయంలో కొలువుదిరిన పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామికి సోమవారం పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంచడం జరిగింది. అన్ని రకాల ప్రశాంతత ఆధ్యాత్మికతతోనే సాధ్యమవుతుందని, ధార్మిక శక్తితోనే అన్ని బాధలను జయించగలమని పూజలో భాగంగా భక్తులకు తెలియజేయడం జరిగింది.