05-11-2025 02:11:50 AM
పెద్దపల్లి నవంబర్04 (విజయక్రాంతి)కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు అభినం దించిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అభినందించారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కూనారం గ్రామంలో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రం రామగిరి వ్యవసాయ అనుబంధ శాఖల సహకారంతో మండల స్థాయి రైతు సదస్సలో మంగళవారం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొని కృషి విజ్ఞాన కేంద్రం గ్రామాల్లో చేపడుతున్న వివిధ రైతు అభివృద్ధి కార్యక్రమాలను గురించి తెలుసుకొని శాస్త్రవేత్తల బృందాన్ని అభినందించారు. జి ల్లా రైతులు వరి కొయ్యల్ని కాల్చడం వల్ల ఏర్పడే నష్టాల్ని తెలియజేస్తూ వరి కోయల్ని కాల్చకుండా పొలంలో కలియ దున్నాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఏ ఒక్క రైతుకి యూ రియా కొరత లేకుండా చూస్తున్నామని, జిల్లా రైతులు కృషి విజ్ఞాన కేంద్రం, కూనా రం పరిశోధనా సంస్థలు అందించే సదుపాయాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమానికి కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్ట ర్ దండా రాజి రెడ్డి, విశిష్ట అతిథిగా పాల్గొని రైతులను ఉద్దేశించి పలు విషయాలను పం చుకున్నారు. కూనరం వ్యవసాయ పరిశోధన సంస్థ, కృషి విజ్ఞాన కేంద్రం చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి కూనారం వరి రకాలను గురించి వివరిస్తూ రైతులు ఈ ప్రాంతంలో ఉన్న ఈ సంస్థల సదుపాయాలను వినియోగించుకోవాలని, ఒక్క వరి పం ట మీద ఆధారపడకుండా కూరగాయలు, పండ్ల తోటల మీద దృష్టి సారించాలని దీని కి సరిపడా సాంకేతిక సమాచారాన్ని మా శాస్త్రవేత్తల బృందం అందిస్తారని రైతులకు తెలిపారు,
అలాగే సేంద్రియ వ్యవసాయం పై రైతులకి అవగాహనను కల్పించడం కో సం విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రా లు వృత్తి నైపుణ్యత శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నారని, ఇలాంటి సదుపాయాలను రైతులు వినియోగించుకోవాలని తెలిపారు. కోరమండల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ రైతులు అధిక మోతాదులో రసాయన ఎరువుల వాడకం వలన భూసారం నిర్వీర్యం అ వుతుందని పూర్వం పశు పోషణ పెంట ఎరువుల సదుపాయం వలన భూసారo ఆరోగ్య కరంగా ఉండేదని ఇప్పుడు ఇలాంటి సదుపాయాలు కృత్తిమంగా సృష్టించవలసి వస్తుం దని తెలిపారు.
అధిక యూరియా వాడకం వల్ల జరిగే నష్టాలను రైతులకు తెలుపుతూ నానో యూరియా నానో, డిఏపి వలన కలిగే లాభాలను రైతులకు వివరించారు. ప్రధాన శాస్త్రవేత్త, ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్, హెడ్ కృషి విజ్ఞాన కేంద్రం రామగిరి కిల్లా మాట్లాడుతూ కృషి విజ్ఞాన కేంద్రం రైతుల అభివృద్ధి కోసం చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి రైతులకు వి వరిస్తూ కూనారం గ్రామంను మూడు సంవత్సరాల పాటు దత్తత తీసుకొని సాంకేతిక కా ర్యక్రమాలను ఈ కూనరం గ్రామంలో నిర్వహిస్తూ రైతులను చైతన్యవంతులను చేస్తామ ని తెలిపారు,
అదేవిధంగా మహిళల అభివృద్ధి కోసం వివిధ వృత్తి నైపుణ్యత శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, పంట మార్పిడి ప్రోత్సహిస్తూ పంట మార్పిడి కింద కంది, పెసర్లు నువ్వులను ఉచితంగా రైతుల కు పంపిణీ చేస్తూ నూనె గింజలు, అపరాల పంటలను జిల్లాలో ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కూనారం వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సతీష్ చం ద్ర మాట్లాడుతూ కునారం పరిశోధనా సంస్థ అభివృద్ధి చేసిన వివిధ వరి వంగడాల గురించి రైతులకు వివరిస్తూ రబీ సీజన్లో అ నువుగా ఉండే వరి రకాల గురించి రైతులకు తెలిపారు.
చాలామంది రైతులు ఏక పంట అనగా ఒక్క వరి పంట మీదే ఆధారపడకుండా వరికి ప్రత్యామ్నాయంగా కూరగాయలు, పండ్ల సాగు మీద దృష్టి సారించా లని, ఇది చాలా లాభదాయకమని డాక్టర్. తండ రాజి రెడ్డి, ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి రైతులని ప్రోత్సహించారు. జిల్లా ఆదర్శ రైతు ఎర్రం మల్లారెడ్డి, మాట్లాడుతూ డాక్టర్ దండ రాజి రెడ్డి రైతులని పంట మార్పిడి వైపు ప్రోత్సహిస్తూ ఉద్యాన పంటల సాగును రాష్ట్రంలో పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నందున ఒక చిరు సన్మానంగా నాగలిని బహుకరించారు.
అనంతరం డాక్టర్ దండ రాజిరెడ్డి ఉద్యాన పాలిటెక్నిక్ కాలేజ్ రామగిరి కృషి విజ్ఞాన కేంద్రం రామగిరి సందర్శించి అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలను పరిశీలించి తీవ్ర సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన విశ్వవిద్యాలయ రిజిస్టరర్ డాక్టర్. భగవాన్, విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు డాక్టర్ సురేష్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, సీనియర్ అసోసియేట్, వైస్ ప్రెసిడెంట్ కోరమండల్ ప్రైవేట్ లిమిటెడ్ చక్ర రావు,
స్వామి ప్రొఫెసర్, శాతవాహన యూనివర్సిటీ, వెంకటరమణ పిడి, డిఆర్డిఏ, సారయ్య గౌడ్, ఎక్స్ జెడ్పిటిసి, పురుషోత్తం, పిఎసిఎస్ చైర్మన్, తిరుపతి రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కల్వ శ్రీరాంపూర్ మండల, రామ్మోహన్ రావు చారి, ఎంపీడీవో, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల బృందం తో పాటు పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.