05-11-2025 02:11:43 AM
- ఈనెల 7న రెండవ స్నాతకోత్సవం
- రాష్ట్ర గవర్నర్ రాక
-రంగ రంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు
కరీంనగర్, నవంబర్54(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పదంలో ముందుకు దూసుకువెళ్తున్న శాతవాహన విశ్వవిద్యాలయం రెండవ స్నాతకోత్సవానికి ముస్తాబయింది.ఉపకులపతి ఆచార్య ఉమే ష్ కుమార్ సారథ్యంలో ఈ నెల 7న ఘనం గా నిర్వహించడానికి విశ్వవిద్యాలయ క్రీడా ప్రాంగణంలో సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర గవర్నర్ విశ్వవిద్యాలయ కులపతి జిష్ణు దేవ్ వర్మ హాజరు కానున్నారు.
కీలక ఉపన్యాసం ఇవ్వడానికి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాల యం ఉపకులపతి ఆచార్య బి జె రావు వస్తున్నారు.ఈ రెండవ స్నాతకోత్సవంలో విశ్వవి ద్యాలయ పరిధిలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 161 మందికి బంగారు పథకాలు, అలాగే 25 మందికి పరిశోధనలలో ప్రతిభ కనపరిచినందుకు పిహెచ్డి పట్టాలు బహుకరించను న్నారు. ఇందుకోసం దాదాపు 24 మంది ప్రముఖులు, కొన్ని ట్రస్తులు బహుకరించిన బంగారు పతకాలను ప్రధానం చేయనున్నారు. ఆగస్టులో ఉపకులపతి ఆచార్య ఉమే ష్ కుమార్ అమెరికా పర్యటనకై వెళ్లి అక్కడ తెలంగాణ మేధావులను కలిసి విశ్వవిద్యాలయాన్ని బలోపేతం చేయడానికి నిధులను మౌలిక సదుపాయాల కొరకు అ త్యుత్తమ లేబరేటరీ పరికరాల కొరకు సమకూర్చారు.
రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆదేశాల మేరకు విశ్వవిద్యాలయంలోని అన్ని కోర్సులలో అధ్యాపకులకు, విద్యార్థులకు ముఖ జీవమాపనము (ఫేసియల్ బయోమెట్రిక్ ) ను అమలు చేస్తున్నారు. విద్యార్థులకు అత్యున్నత సదుపాయాలలో భాగంగా డిజిటల్, స్మార్ట్ క్లాసులను ప్రతి విభాగానికి సమకూర్చారు. అన్ని కళాశాలలకు ప్రత్యేకంగా కంప్యూటర్ ల్యాబ్ లను ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ కార్యాశాలల కొరకు ఆరట్స్ కళాశాలలో సెమినార్ హాలును పరిపాలనా భవనంలోని రెండవ అంతస్తులొ మరియొక సెమినార్ హల్ ను నవీనికరించడం జరిగింది. ఉపకులపతి ఉమేష్ కుమార్ మాట్లా డుతూ విశ్వవిద్యాలయాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో తీసుకు వెళ్తూ కొత్త సంస్కరణలను చేపడుతూ ముందుకు వెళ్తున్నామని ఈ రెండవ స్నాతకోత్సవాన్ని కూడా అత్యంత భద్రత ఏర్పాట్లలొ నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు.
స్నాతకోత్సవానికి హాజరయ్యే అభ్యర్థులు ఆన్లైన్లో పేరు నమో దు చేసుకున్నారని, వారితో పాటు మరొకరికి పాసులను అందజేస్తామని వీటిని నవంబర్ 5వ తారీఖు లోపల అభ్యర్థులు తమ ఐడెంటిటీ కార్డును సమర్పించి ఒంటి గంట నుండి నాలుగు గంటల వరకు పొందగలరని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి సురేష్ కుమార్ తెలియజేశారు. ముందస్తుగా అప్లై చేసుకోని వారికి స్నాతకోత్స వంలో పట్టాలను ఇవ్వరని, హాజరయ్యే అభ్యర్థులు ఏడో తారీకు ఉదయం 9:30 లోపు స్నాతకోత్సవ ప్రాంగణంలో తమకు కేటాయించిన సీట్లలో కూర్చోవాలని స్నాతకోత్సవం 10 గంటల నుండి ఒంటి గంట ముప్పు నిమిషాల వరకు జరుగుతుందని ఎలాంటి అవరోధాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఉపకు లపతి ఆచార్య ఉమేష్ కుమార్, రిజిస్ట్రార్ ఆచార్య జాస్తి రవికుమార్‌తెలిపారు.