05-11-2025 02:14:43 AM
లక్షలు దండుకొని, పని రేపు, మాపు అంటూ కాలం గడుపుతున్న పైరవికారులు.
పని కాలేదని డబ్బులు ఇమ్మంటే, ఉల్టా వారే కేసులు పెడుతామని బెదిరిస్తున్నారని వాపోతున్న బాధితులు
పోలీస్‌లు నిఘా విభాగంతో నిశితంగా పరిశీలిస్తే అన్ని వెలుగులోకి
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 04 (విజయక్రాంతి): ఓ లక్ష యాభై వేలు తీసుకురా.. అటెండర్ జాబ్ ఇప్పిస్తా..? 2లక్షలు తే అ జిల్లా ఆఫీసర్ మనోడే పదిరోజుల్లో పనైపోద్ది. 3లక్షలు ఇవ్వు నిన్ను ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేయిస్తా...! అంటూ రాజన్న సిరిసిల్లా జిల్లా లో కొంత మంది పెట్రేగిపోతున్న పైరవికారులు.వీళ్లంతా సుదీర్ఘంగా రాజకీయ నాయకులుగానో, వారితో బంధం,అనుబం ధం, ఉన్న వారా..? అంటే అది కాదు.
కేవలం గత ఐదేళ్ల నుండీ రాజకీయ సభలు, సమావేశాలలో పాల్గొంటు, వారి తో ఫొటోలో దిగుతూ, వాట్సాప్ స్టేటస్ లు పెట్టుకుంటూ, వాటిని చేస్తూ, ప్రజలను, ఉద్యోగులను నమ్మిస్తూ, చూసారు కదా!సార్, మనకు చాలా దగ్గర జాబ్ కావాలా, ట్రాన్ఫర్ చేయాలా..? ఏ పనైనా సరే అంత మనోళ్లే అంటూ లక్షలు కాజేస్తున్నారు.ఇ లాంటి బ్యాచ్ లు ఈ మధ్యకా లంలో ఎక్కువైయ్యాయని‘నేటిభారతం’పరిశీలనలో తెలింది.
మీరు పిలిస్తేనే మా నాన్నకు గుండె నొప్పి
ఈ మధ్య కాలంలో ఓ పైరవి కారుడు ఓ యూనిఫామ్ పోలీస్ ఉద్యోగికి బదిలీ చేయిస్తా నంటూ, అతని నుండీ లక్ష రూపాయలు తీసుకున్నాడు.రోజులు గడుస్తున్న పని జరగక పోవడంతో సదరు ఉద్యోగి తన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరితే రేపు, మా పు అంటూ, రోజులు గడుపుతున్నాడు.చేసేది లేక పోలీస్ స్టేషన్ కి పిలిపిస్తే పిర్యాదు ఇవ్వకుండా ,డబ్బులు ఇస్తానంటూ నమ్మబలికి, మరుసటి రోజు తానే పోలీస్ స్టేషన్ కు వెళ్ళి, పోలీస్ పిలవడం వల్లె మా నాన్నకు గుండె పోటు వచ్చిందని, తానే పోలీస్ ల పై పిర్యాదు చేసినట్టు సమాచారం.
ఇలా ప్రజల, ఉద్యోగుల, వ్యాపారుల అవసరాలను వాడుకుంటూ లక్షలు వెనకేసుకుంటున్నారు పైరవి కారులు.ఇప్పటికైనా పోలీస్ లు ఇలాంటి నుండీ ప్రజలను, ఉద్యోగులను, వ్యాపారులను కాపాడాలి.