04-10-2025 01:25:06 AM
సుల్తానాబాద్ అక్టోబర్ 3 (విజయ క్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వా మి దేవాలయం నుండి దసరా వేడుకల్లో భాగంగా నిర్వహించిన రథయాత్ర లో పెద్దపల్లి ఎమ్మె ల్యే చింతకుంట విజయ రమణారావు పాల్గొన్నారు... ఈ సందర్భం గా శ్రీ వేణుగోపాలస్వామి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.... పూజారి సౌమిత్రి శ్రావణ్ కుమార్ వేణు మాధవ్ లు ్ర పత్యేక పూజలు చేశారు, అనంతరం జమ్మి పూజలు పాల్గొని పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు.... అమ్మవారి దీవెనలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగిందన్నారు.... ఈ కార్యక్రమంలో దేవాలయం చైర్మన్ పల్లా మురళీధర్ , గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ , మార్కెట్ చైర్మన్ ప్రకాష్ రావు , సింగిల్ విండో చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.