calender_icon.png 4 October, 2025 | 7:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుంటక నర్సయ్య సేవలు మరువలేనివి

04-10-2025 01:23:56 AM

కొత్తపల్లి, అక్టోబర్ 03(విజయక్రాంతి):చేనేత ఉద్యమ పితామహుడు గుంటక నర్సయ్య పంతులు పద్మశాలి సమాజానికి, చేనేత ఉద్యమానికి, విద్యారంగానికి చేసిన సేవలు మరువలేనివని జిల్లా పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు వాసాల రమేష్, అధ్యక్షులు మెతుకు సత్యం, సంక్షేమ ట్రస్ట్ జిల్లా అధ్యక్షుడు స్వర్గం మల్లేశం, పోపా జిల్లా అధ్యక్షుడు పోలు సత్యనారాయణ అన్నారు.

కరీంనగర్ లోని పద్మశాలి సంక్షేమ ట్రస్ట్ ఆడిటోరియంలో జయంతి కన్వీనర్ డాక్టర్ సబ్బని లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గుంటక నర్సయ్య పంతులు 123వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై వారు మాట్లాడుతూ గుంటక నర్సయ్య పంతులు నైజాం రాష్ట్ర పద్మశాలి కష్ట నివారణ సంఘం ద్వారా వ్యట్టిచాకిరికి వ్యతిరేకంగా ఉద్యమం నడిపారన్నారు.

ఆచార కొండా లక్ష్మణ్ బాపూజీని సమాజానికి పరిచయం చేసి ప్రజానాయకుడిగా నిలబెట్టాడని అన్నారు. 1940- 46 లో తెలంగాణలోని పలు జిల్లాల్లో సభలు నిర్వహించి పద్మశాలిలను సంఘటితం చేసినాడన్నారు. ఈ జయంతి వేడుకల్లో జయంతి వేడుకల కన్వీనర్, రిటైర్డ్ లెక్చరర్, డాక్టర్ సబ్బని లక్ష్మీనారాయణ, పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వోల్లాల కృష్ణహరి, మాజీ జెడ్పిటిసి ఇప్పనపల్లి సాంబయ్య, జిల్లా కోశాధికారి అల్స భద్రయ్య,జిల్లా నాయకులు వంగర ఆంజనేయులు, దీకొండ లక్ష్మీనారాయణ, కట్ల సాయన్న, నందాల శివప్రసాద్, మెతుకు గోపికృష్ణ, గుట్ల సత్తయ్య, వాసం శివ నారాయణ, పాము రాజేశం తదితరులుపాల్గొన్నారు.