calender_icon.png 4 October, 2025 | 10:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దసరా వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది

04-10-2025 01:26:13 AM

రాజన్న సిరిసిల్ల :సెప్టెంబర్ 3 (విజయక్రాంతి)వేములవాడ పట్టణంలో విజయ దశమి సందర్భంగా పట్టణంలోని సాయి బాబా ఆలయంలో గల జమ్మి చెట్టు షమి పూజలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు&అమ్మవారికి,జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు..ప్రభుత్వ విప్ అనంతరం బంగారం జమ్మిని పంచుతూ అలయ్ బలాయ్ తీసుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలిపారు..వారు మాట్లాడుతూ చెడు పై మంచి సాధించిన విజయంగా దసరా విజయదశమి జరుపుకుంటారని రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ విప్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

అందరూ శమీ పూజ చేసి జమ్మి ఆకును బంగారంగా భావించి అలయ్ బలాయ్ తీసుకొని, పెద్దల ఆశీర్వాదం తీసుకొని శుభసూచకంగా భావించే పాలపిట్ట ను దర్శించుకోవడం మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ విజయదశమి అందరూ కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని మంచి ఆది శ్రీనివాస్ ఆకాంక్షించారు. ఈ విజయదశమి నుండి ప్రతి ఒక్కరి జీవితంలో మరిన్ని విజయాలు సాధించేలా ఆశీర్వాదం ఉండాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆ అమ్మవారిని ప్రార్థించారు.

ఎడ్లబండ్లతో ర్యాలీలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది

దసరా పర్వదినం సందర్భంగా వేములవాడ పట్టణంలో నిర్వహించిన ఎడ్ల బండి ఊరేగింపులో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఎడ్ల బండిని స్వయానా నడుపుతూ వేములవాడ పట్టణ పుర వీధుల్లో తిరుగుతూ సందడి చేశారు&గాంధీ జయంతి సందర్భంగా వేములవాడ అర్బన్ మండలం చిర్లవంచ,పట్టణంలో మహాత్మా గాంధీ విగ్రహనికి విప్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు..