13-07-2025 06:51:51 PM
మునుగోడు (విజయక్రాంతి): మునుగోడు మండల ఆశా వర్కర్ల యూనియన్ సిఐటియు మండల అధ్యక్ష, కార్యదర్శిగా వి నిర్మల, ఎం కవితను సిఐటియు మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు(CITU Mandal Convener Varikuppala Muthyalu) సమక్షంలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నిర్మల, కవిత మాట్లాడుతూ.. ఆశ వర్కర్లకు స్థిర కనీస వేతనం నెలకు 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆశ వర్కర్లను మూడవ తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, 20 రోజుల క్యాజువల్ సెలవులు, వేతనంతో కూడిన మెడికల్ సెలవులు నిర్ణయించాలని అన్నారు.
ఆశ వర్కర్లకు పెన్షన్, ఇతర సామాజిక భద్రత ప్రయోజనాలను కల్పించాలని డిమాండ్ చేశారు. తమ నియామకానికి సహకరించిన తోటి ఆశా వర్కర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వారితో పాటు ఎన్నికైన వారు అధ్యక్షురాలుగా ఏ కమల, ఎం పుష్ప, కోశాధికారిగా ఎం లక్ష్మి కమిటీ సభ్యులుగా ఎన్ లింగమ్మ, వి కమల, పి మమత, జి వసంత, పి నాగమణి, పి జ్యోతి, జె ఇంద్ర, ఎస్ సుజాత, ఎం ధనలక్ష్మి, వి లక్ష్మి, ఎన్ జ్యోతి, జి ధనమ్మ, ఈ మమత, డి రాణి, డి ధనలక్ష్మిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు వేముల లింగస్వామి, యాట యాదయ్య తదితరులున్నారు.