13-07-2025 05:11:10 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆషాడ మాసం పురస్కరించుకొని రెబ్బెన మండలం వంకులం గ్రామ సమీపంలోని పెద్దవాగు వద్ద గల గాంధారి మైసమ్మకు ఎమ్మెల్యే కోవలక్ష్మి(MLA Kova Laxmi) బోనం సమర్పించారు. పంకులం గ్రామ ప్రజల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో మహిళలు, ప్రజలు డోలు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ బోనాల పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ్, మహేష్, తిరుపతి, ఓమాజీ, నాగయ్య, రవీందర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.