13-07-2025 06:14:45 PM
మృతి చెందిన పెళ్లి కుమారుడు, అతని స్నేహితుడు..
పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్తుండగా దుర్ఘటన..
కన్నీరు మున్నీరు అవుతున్న కుటుంబ సభ్యులు..
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) ఖానాపూర్ మండలం డబుల్ బెడ్ రూమ్ కాలనీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మరో వారం రోజుల్లో వివాహం ఉందని పెళ్లి కుమారుడు జన్నారం మండలం ఇంధన్ పల్లి గ్రామానికి చెందిన చొప్పదండి లక్ష్మణ్(25) తన వరసకి బావమరిది అయిన జస్వంత్ ను తీసుకుని పల్సర్ బైక్ మీద నిర్మల్ పట్టణానికి పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్తుండగా డబుల్ బెడ్ రూమ్ కాలనీ వద్ద బైకు అదుపుతప్పి కల్వర్టుకు ఢీకొట్టి పొదల్లోకి లాక్కెల్లడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలిపారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.