13-07-2025 06:39:25 PM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన బీసీ నేతలు..
బీసీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పానగంటి విజయ్ గౌడ్..
మునుగోడు (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(PCC President Bomma Mahesh Kumar Goud)ను జూబ్లిహిల్స్ లోని వారి నివాసంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పానగంటి విజయ్ గౌడ్ కలిసి కృతజ్ఞతలు తెలిపి మాట్లాడారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో బీసీ ప్రతినిధుల, వివిధ సంఘాల బీసీ నాయకులు ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు లను కలిసి అభినందించడం జరిగిందని అన్నారు.
బీసీ రిజర్వేషన్ ల చట్ట సవరణకు ఆర్డినెన్స్ జారీ చేసి బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయంపై ధన్యవాదాలు తెలియజేశారు. స్థానిక ఎన్నికలు పూర్తయ్యే వరకు బీసీలు, బీసీ సంఘాలు అప్రమత్తంగా ఉండి హక్కులను సాధించుకోవాలని కోరారు. బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే అన్ని రాజకీయ పార్టీలు 42 శాతం రిజర్వేషన్ లకు మద్దతుగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూడిద మల్లికార్జున్ యాదవ్ తదితర బీసీ నేతలు ఉన్నారు.