calender_icon.png 14 July, 2025 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నియోజకవర్గంలో కంటి సమస్యతో బాధపడేవారు ఉండకూడదు..

13-07-2025 06:30:41 PM

ఐదవ విడత ఉచిత కంటి వైద్య శిబిరంలో 900 ముందికి వైద్య పరీక్షలు..

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో పోటీతత్వం పెరగాలి..

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..

మునుగోడు/మర్రిగూడ (విజయక్రాంతి): మునుగోడు నియోజకవర్గంలో కంటి సమస్యతో బాధపడేవారు ఏ ఒక్కరు కూడా ఉండకూడదు అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) అన్నారు. ఆదివారం మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడెం మండలంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల్లో పోటీతత్వం పెరగాలని పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఐదవ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు.

ఇప్పటికే నాలుగు ఉచిత కంటి వైద్య శిబిరాలతో 682 మందికి కంటి ఆపరేషన్లు పూర్తి చేయించమన్నారు. 10 పదివేల మందికి కంటి శస్త్ర చికిత్సలు చేయించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఉచిత కంటి వైద్య శిబిరంలో మర్రిగూడ మండల వ్యాప్తంగా 900 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో 230 మంది కంటి ఆపరేషన్లకు ఎంపికయ్యారు. వెంటనే 129 మందిని హైదరాబాద్ గచ్చిబౌలిలోని శంకరా కంటి ఆసుపత్రికి ఆపరేషన్ కి తరలించారు. మిగిలిన 101 మందిని తర్వాత పంపిస్తామని అన్నారు. 2024-2025 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో మొదటి స్థానం సాధించిన విద్యార్థినికి 15000 రూపాయలు, ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థినికి 10000 రూపాయలు, తృతీయ స్థానం సాధించిన విద్యార్థినికి 7500 రూపాయల నగదు బహుమతిని అందించి, శాలువాతో సన్మానించి మెమెంటో అందించారు.

కస్తూరిబా బాలికల విద్యాలయంలో విద్యార్థినుల సంఖ్య ఎక్కువగా ఉండడం సంఖ్యకు అనుగుణంగా మౌలిక వసతులు లేవని సిబ్బంది విద్యార్థినులు ప్రధానమైనవి బాత్రూమ్స్ సమస్య, డార్మిటరీ హాల్స్, విద్యార్థినులు పడుకోవడానికి సరిపడా రూములు లేవని ఒక్కో రూములో 60 మంది విద్యార్థినులు పడుకోవాల్సి వస్తుందని సిబ్బంది ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే తన సొంత నిధులతో ఖాళీగా ఉన్న ఫస్ట్ ఫ్లోర్ పై నాలుగు రూములు నిర్మించి ఇస్తానని బాత్రూమ్స్ కూడా సరిపడా వెంటనే నిర్మాణం చేపడతానని హామీ ఇచ్చి, తక్షణమే తన వ్యక్తిగత ఇంజనీర్ కు ఫోన్ చేసి రేపటినుండే నిర్మాణ పనులు మొదలుకావాలని ఆదేశించారు. ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న విద్యార్థినుల తరగతి గదికి వెళ్లి... ప్రభుత్వ విద్యను కాపాడడానికి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి పేద విద్యార్థిని విద్యార్థులకు ఆసరాగా ఉండడానికి తాను నగదు బహుమతిని అందిస్తున్నానని అన్నారు.

ఈ సంవత్సరం పదవ తరగతి పఠించే విద్యార్థిని విద్యార్థులు ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మార్కులు తెచ్చుకోవాలని సూచించారు.. వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలో చదివే పదవ తరగతి విద్యార్థులకు తాను ఇచ్చే నగదు బహుమతిని కూడా పెంచుతానన్నారు... పదవ తరగతిలో మొదటి స్థానంలో ఉత్తీర్ణత సాధించిన వారికి 25 వేల రూపాయలు, ద్వితీయ స్థానం సాధించిన వారికి 15 వేల రూపాయలు, తృతీయ స్థానం సాధించిన విద్యార్థిని విద్యార్థులకు పదివేల రూపాయలు అందజేస్తానన్నారు. నేను కల్పించే ఈ ఆర్థిక ఆసరాతో మీరు పై చదువులు చదవడానికి తల్లిదండ్రుల పైన ఆధారపడాల్సిన అవసరం ఉండదని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, విద్యార్థులు, కంటి వైద్య బాధ్యతలు ఉన్నారు.