24-07-2025 09:59:55 PM
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం దగ్గర కరకట్ట, విస్తా కాంప్లెక్స్ వద్ద డ్రైనేజ్ స్లుయిస్ ప్రాంతంలో గురువారం భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకటరావు(MLA Tellam Venkata Rao) పర్యటించి, గోదావరి వరద నుండి విస్టా కాంప్లెక్స్ వాసులను సప్తదిగు ప్రజలను కాపాడటానికి ఇరిగేషన్ శాఖ ఏర్పాటుచేసిన మోటర్లను పరిశీలించారు. ఏ విధంగా పనిచేస్తున్నాయో అడిగి తెలుసుకున్నారు. వర్షాలు ఎక్కువ ఉన్నందున ఎగువ ప్రాంతం నీరు ఊర్లోకి రాకుండా, ఊర్లోని డ్రైనేజ్ వాటర్ ని మోటార్ పంపాల ద్వారా గోదావరిలో పంపడం కొరకు ఏర్పాటు చేసిన మోటార్లను పరిశీలించారు. అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.