24-07-2025 09:47:37 PM
మందమర్రి (విజయక్రాంతి): పాము కాటుతో మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని తుర్కపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పట్టణ ఏఎస్ఐ మజీద్(ASI Majeed) తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తుర్కపల్లి గ్రామానికి చెందిన గృహిణి మంద శ్రీలత బుధవారం ఉదయం కాలకృత్యాల కోసం బయటకు వెళ్లగా, ఆమె కుడికాలు మడమపై పాము కాటు వేసింది. వెంటనే ఆమె విషయాన్ని ఆమె భర్త మంద రాజుకు తెలుపగా వెంటనే కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ లో ఆమెను మొదట మంచిర్యాల ప్రభుత్వ తరలించి, అనంతరం మెరుగైన చికిత్స కొరకు కరీంనగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా, చికిత్స పొందుతూ శ్రీలత అదే రోజు మృతి చెందింది. ఈ మేరకు మృతిరాలి భర్త రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.