calender_icon.png 13 September, 2025 | 5:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

13-09-2025 02:33:49 AM

రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కు అందజేత

తాండూరు ,12 ఆగస్టు( విజయ క్రాంతి) : వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం సంఘం కలాన్ గ్రామానికి చెందిన రైతు మొగులప్ప గత గురువారం (నిన్న) పొలం పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వెళుతుండగా వాగు దాటే క్రమంలో వర్షపు నీటి ఉధృతికి కొట్టుకుపోయి గల్లంతైన విషయం తెలిసిందే.

గతరాత్రి వరకు రెవిన్యూ, పోలీస్ అధికారులు గాలించిన లాభం లేకుండా పోయింది.  వర్షపు నీటి ఉధృతి తగ్గడంతో నేడు ఉదయం గ్రామస్తులు మొగులప్ప ఆచూకీ  కోసం గాలిస్తుండగా శవమై కనిపించాడు.

దీంతో గ్రామంలో. తీవ్ర విషాదఛాయలు అమ్ముకున్నాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి రూ ఐదు లక్షల  ఎక్స్గ్రేషియా చెక్కును బాధిత కుటుంబానికి అందించారు. మృతుడు మొగులప్ప కుటుంబానికి ఆసరాగా ఉంటామని  ఆయన అన్నారు.