calender_icon.png 22 October, 2025 | 11:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్యనాథేశ్వరాలయంలో ఎమ్మెల్యే పూజలు

22-10-2025 12:00:00 AM

కామారెడ్డి, అక్టోబర్ 21 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వైద్యనాథేశ్వరాలయంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా అమావాస్య ఉండడంతో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శనేశ్వరాలయం లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అమావాస్య, కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు ప్రశాంతంగా సుఖశాంతులతో జీవించాలని వైద్యనాథుని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు రవీందర్ రెడ్డి, కృష్ణమూర్తి, సతీష్ శర్మ, దేశ్ పాండే, నర్సింలు, బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.