calender_icon.png 22 October, 2025 | 3:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అస్తవ్యస్తం డీఈవో కార్యాలయ నిర్వహణ

22-10-2025 12:00:00 AM

-పూర్తిస్థాయి అనుమతులు లేకుండా కొనసాగుతున్న ప్రైవేటు పాఠశాలలు 

-మూడు నెలలైనా అమలు కాని కలెక్టర్ ఆదేశం 

-ఉపాధ్యాయుల ఎస్‌ఆర్‌లు యూనియన్ నాయకుల పరం

-ఆమ్యామ్యాల మత్తులో డీఈఓ కార్యాలయం

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 21 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విద్యాశాఖ అస్తవ్యస్తంగా సాగుతోంది. ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిలో జిల్లా విద్యాశాఖ కార్యాలయం పనితీరు ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో పుట్టగొడుగుల పూర్తిస్థాయి అనుమతులు లేని ప్రైవేటు పాఠశాలలుగా కోకొలలు నడుస్తున్నాయి. పలుమార్లు పత్రికలో ప్రచురిత మైన, ఆధారాలతో అధికారులకు నివేదించిన చర్యలు శూన్యం. ప్రైవేటు పాఠశాలల నిర్వహణ అధికారులకు కాసుల వర్షం కురిపిస్తుందనే ఆరోపణలు వెలబడుతున్నాయి.

అనుమతులు ఒకచోట నిర్వహణ మరోచోట

 పాల్వంచ పట్టణంలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనుమతుల్లో నిబంధనలకు తూట్లు పొడిచి ఏదేచ్ఛగా నిర్వహిస్తున్న, పారదర్శక లోపించిన పట్టించు కునే నాధుడే కరవయ్యారు. నారాయణ ఇంగ్లీష్ మీడియం అనుమతుల వ్యవహారంపై గతంలో విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి, కుర్చీలను ధ్వంసం చేసిన సంఘటనలు సైతం ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలల సంఘం నేరుగా ఫిర్యాదులు చేసిన అధికారులు చల నం లేదంటే ఆ పాఠశాల యాజమాన్యం నుంచి విద్యాశాఖ అధికారులకు పెద్ద మొ త్తంలో ఆమ్యామ్యాలు అందుతున్నాయని ఆరోపణలు ధ్రువపరుస్తున్నాయి.

పాఠశాల అనుమతులకు ఓపెనింగ్ పర్మిషన్లు లేకు న్నా, పేరు మార్పిడి చేసి రెన్యువల్ చేయడం, అనుమతుల్లో చూపిన ప్రాంతంలో కాకుండా మరో ప్రాంతంలో పాఠశాల నడుస్తున్నట్లు ఆధారాలు చూపిన పట్టించుకోక పోవడం జిల్లా విద్యాశాఖ అధికారుల పనితీరును అద్దం పడుతోంది. పాఠశాల అను మతులపై పూర్తి నివేదిక సమర్పించాలని ఆర్జేడి ఆదేశించి నెలరోజులు అవుతున్న అధికారుల్లో ఎలాంటి చలనం లేదు. అను మతుల్లోనే కాకుండా విద్యా బోధనలోనూ అర్హత లేని ఉపాధ్యాయులతో విద్యాబోధనలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వస్తు న్నాయి. కొత్తగూడెం పట్టణంలో శ్రీ రాగాపాఠశాల, ఎస్‌ఆర్‌కేటి పాఠశాలలకు పూర్తిస్థాయి అనుమతులు లేకున్నా కొనసాగుతున్నాయి. డీఈఓ నాగలక్ష్మి కి పలుమార్లు విన్నవించిన ఫలితం లేకుండా పోతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

కలెక్టర్ ఆదేశించిన అమలు శూన్యం.

ఇల్లందు మండలం మర్రిగూడెం మం డల పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయు డు రమేష్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మూడు నెలల క్రితం డిఈఓ ను ఆదేశించిన నేటికీ అమలు చేయకపోవడం శోచనీయం. సదరు ఆ ఉపాధ్యాయుడు ఏకంగా ఎంఈఓ లనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తానని బెదిరించినట్లు తెలుస్తోంది. సమయ పాలన పాటించకపోవడం, పాఠశాలకు తరచూ గైర్హాజరు కావడం, పాఠశాలకు రాకుండా వచ్చినట్లు సంతకాలు చేసినట్లు విచారణలలో ఆధారాలు బహిర్గతమైన అతనిపై చర్యలు తీసుకోక పోవడంపై అనేక అనుమానాలకు తావిస్తోంది. తాజాగా ఉపాధ్యాయుల సర్వీస్ రిజిస్టర్ లను ఓ ఉపా ధ్యాయ సంఘం నేతలకు ఒక్కొక్కరికి పది నుంచి 12 సర్వే రిజిస్టర్లు ఇవ్వడం గమనార్హం.

ఉపాధ్యాయుల అనుమతితో ఒకటి, రెండు సర్వీస్ రిజిస్టర్లు సంఘం నాయకులకు ఇవ్వడం సర్వసాధారణం, అందుకు విరుద్ధంగా ఒక్కొక్క సంఘం నాయకుడు పెద్ద మొత్తంలో సర్వే రిజర్వేషన్లు తీసుకెళ్లడం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఇవి కేవలం మచ్చుతునకలు మాత్రమే. ఇలా అయితే పారదర్శకతతో కూడిన నాణ్యమైన విద్య విద్యార్థులకు ఎలా అందుతుందని ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ కల్పించుకొని జిల్లాలో విద్యాశాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించి, పూర్తిస్థాయి అనుమతి లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, మర్రిగూడెం ప్రధానోపాధ్యాయునీపై క్రమశిక్షణ చర్యలు చేప ట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయమై డీఈవో నాగ లక్ష్మిని వివరణ కోరగా పైన తెలిపిన ఆరోపణలను పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.