calender_icon.png 12 September, 2025 | 9:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ రాజ్యం కాదు.. పోలీసుల రాజ్యం నడుస్తోంది

05-12-2024 08:36:50 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన చేస్తున్నారు. హరీశ్ రావును గురువారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. హరీశ్ రావును  కవిత, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ... ఫిర్యాదు ఎందుకు తీసుకోరని సీఐని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ సర్కార్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేలను కోర్టు మూసిన తర్వాత పంపించాలనే జాప్యం చేస్తున్నారని పోలీసులపై మండిపడ్డారు. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు పోలీసుల రాజ్యం నడుస్తోందని కవిత ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యం ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పెట్టిన అక్రమ కేసులను వెనక్కి తీసుకొని వారిని వెంటనే విడుదల చేయలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.