05-12-2024 07:37:57 PM
ముంబయి,(విజయక్రాంతి): మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీ అగ్రనేత దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర మూడో ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేశారు. శివసేన అధినేత ఏక్ నాథ్ షిండే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ వీరితో ప్రమాణ స్వీకార చేయించారు. ముంబయిలోని ఆజాద్ మైదాన్ లో ప్రమాణస్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, నీతీష్, యోగి ఆదిత్యనాథ్, ముకేష్ అంబానీ, కుమార మంగళం బిర్లా, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణ్ బీర్ కపూర్, సచిన్ తెందూల్కర్ దంపతులు సహా ఎన్డీయే పాలిత రాష్ట్రాల నుంచి 19 మంది ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
నవంబర్ లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటిమి విజయం సాధించినప్పటికి సీఎం ఎవరన్న దానిపై 10 రోజుల తర్వాత బుధవారం స్పష్టత వచ్చింది. బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రిగా ఫడ్నవీడ్, డిప్యూటీ సీఎంలుగా షిండే, అజిత్ పవార్ పేర్లను ప్రకటించింది. కానీ, ఉపముఖ్యమంత్రి పదవికి ఏక్ నాథ్ షిండే అంగికరిస్తారా..? లేదా అన్న దానిపై చివరి వరకు ప్రతష్టంభన కొనసాగింది. శివసేన అధికారిక ప్రకటన చేయడంతో ఉత్కంఠకు తెరపడింది.