calender_icon.png 12 September, 2025 | 7:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎఫ్‌ఐఆర్‌లు గాంధీభవన్‌లో తయారవుతున్నాయి

05-12-2024 09:01:40 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెచ్చిన మార్పు రాజ్యంగ ఉల్లంఘనలు మాత్రమే అని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. ఎఫ్ఐఆర్ లు గాంధీ భవన్ లో తయారవుతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతం కాదని, పోలీసులు రాజ్యంగానికి లోబడి పని చేయాలి. కానీ, రేవంత్ రెడ్డి ఆదేశాలతో పనిచేస్తే భవిష్యత్ లో ఇబ్బందు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో ఒక్క మంచి పని చేశారా..? అని హరీశ్ రావు ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఏడో గ్యారంటీగా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని, రాహుల్ గాంధీ రాజ్యాంగ ఉల్లంఘనలు అంటున్నారు. ముందు రేవంత్ రెడ్డికి చెప్పాలని చమత్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న మహిళలకు ఏం పని చేశారో సీఎం చెప్పాలన్నారు. మూసీ పేరుతో పేదల ఇళ్లు కూలగొట్టాలని తెలంగాణ సర్కార్ చూస్తుందని ఆరోపించారు. ఇంకా ఆరు గ్యారంటీలు అమలు కాలేదని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని తాము అడుతున్నామన్నారు. కేసీఆర్ పాలనలో పీఎస్ లకు రూ.75 వేలు ఇచ్చారని, ఇప్పుడు వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వట్లేదని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.