09-07-2025 05:26:05 PM
కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దొంగరి గోవర్ధన్..
తుంగతుర్తి (విజయక్రాంతి): పేద ప్రజల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నిరంతరం కృషి చేస్తున్నారని, మండల పార్టీ అధ్యక్షులు దొంగరి గోవర్ధన్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ... ఈనెల 14న తిరుమలగిరిలో జరిగే ఉచిత రేషన్ కార్డు పంపిణీ, ఎమ్మెల్యే మందుల సామిల్ జన్మదిన సందర్భంగా వేడుక, కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి హాజరవుతున్నారని, బహిరంగ సభను విజయవంతం చేయుటకు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, దేవాలయం కమిటీ చైర్మన్ ఎనగందుల సంజీవ, పట్టణ అధ్యక్షుడు ఉప్పుల రాంబాబు యాదవ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు తప్పట్ల శంకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కొండ రాజు, పెద్ద బోయిన అజయ్, కలకోట్ల మల్లేష్, మాచర్ల అనిల్, దాయం ఝాన్సీ రాజిరెడ్డి, కటకం వెంకటేశ్వర్లు, బొంకురి రమేష్ ,ప్రవీణ్ రెడ్డి ,అబ్దుల్, సూరయ్య, మాదర బోయిన రవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.