calender_icon.png 9 July, 2025 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుంగతుర్తిలో సాయి పల్లకి సేవ ఊరేగింపు

09-07-2025 05:27:58 PM

తుంగతుర్తి (విజయక్రాంతి): తుంగతుర్తి మండల(Thungathurthi Mandal) కేంద్రంలో శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో గురుపౌర్ణమి మహోత్సవాన్ని పురస్కరించుకొని సాయి పల్లకి సేవ ఊరేగింపు బుధవారం వీధుల్లో తిరుగుతూ, పాటలు పాడుతూ ఘనంగా నిర్వహించారు. పల్లకీ సేవ శోభయాత్రకు అడుగడుగునా మహిళలు మంగళ హారతులతో ఘనస్వాగతం పలుకుతూ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త బాలాజీ భారతి, అర్చకులు గుగ్గిళ్ళ రామాచార్యులు, ఎనగందుల గిరి, శంకర్, ఉమేష్, మహిళా భక్తులు పాల్గొన్నారు.