09-07-2025 05:33:16 PM
హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా(Karimnagar District) హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క(Minister Danasari Seethakka) జన్మదిన వేడుకలను మహిళ పట్టణ అధ్యక్షురాలు వేముల పుఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పుష్పలత మాట్లాడుతూ... మంత్రి సీతక్క గిరిజనుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. ములుగు జిల్లా అభివృద్ధికి సాయిశక్తుల కృషి చేస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు తిరుపతి, జిల్లా అధికార ప్రతినిధి సొల్లు బాబు, సదానందం, మండల అధ్యక్షురాలు పుల్లరాధ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సుశీల, మోరే తిరుపతి, సాదిక్, మధుకర్, రియాజ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.