09-07-2025 05:30:25 PM
లక్షేట్టిపేట (విజయక్రాంతి): మండల న్యాయసేవ సహాయ కమిటీ చైర్మన్, జూనియర్ సివిల్ జడ్జి సాయికిరణ్ కాసమల(Judge Sai Kiran Kasamala) ఆధ్వర్యంలో మోడల్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు తోటి విద్యార్థుల పట్ల సోదరభావంతో మెలగాలని కుల, మత, జాతి, వర్ణ వివక్షతతో సహచర విద్యార్థుల పట్ల అమానుష చర్యలు లేకుండా వారి మనోభావాలపై తీవ్రప్రభావం పడే విధంగా ప్రవర్తిస్తే చట్టాలు కఠినంగా శిక్షిస్తాయని తెలిపారు. ఇలా జరగకుండా కళాశాలల్లో యుజిసి కమిటీలు ఏర్పాటు చేసి మానిటర్ చెయ్యాలని కళాశాల ప్రిన్సిపాల్ కి సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమిరెడ్డి సత్తన్న, జనరల్ సెక్రెటరీ ప్రదీప్ కుమార్, సీనియర్ న్యాయవాదులు కారుకూరి సురేందర్, న్యాయవాది పద్మ, ఏఎస్సై, కళాశాల అధ్యాపకులు, మండల న్యాయసేవ సహాయ ఉద్యోగులు నీరజ ,యశోద పాల్గొన్నారు.