calender_icon.png 9 September, 2025 | 8:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గీతంలో మాక్ డ్రిల్ విపత్తు సమయంలో ఒడుపుగా వ్యవహరించడంపై శిక్షణ

09-09-2025 12:00:00 AM

పటాన్చెరు, సెప్టెంబర్ 8 :సంక్షోభ పరిస్థితులలో విద్యార్థులు, సిబ్బంది భద్రతను ని ర్ధారించడానికి, అత్యవసర సంసిద్ధతను బ లోపేతం చేసి, విపత్తు సమయంలో ఒడుపు గా వ్యవహరించడంపై శిక్షణ ఇచ్చేందుకుగాను రుద్రారంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యా లయంలో సోమవారం మాక్ డ్రిల్ ను నిర్వ హించారు. అంతేగాక గాయపడిన వ్యక్తులు, వయసు మళ్లినవారు, మహిళలు, ఇతరుల ను దుర్భలమైన ప్రదేశాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించి, రక్షించడంలో సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి కూడా ఈ మాక్ డ్రిల్ ఉపకరిస్తుందని తెలిపారు.

ఆకస్మిక అగ్ని ప్ర మాదాలు, లేదా ఏవైనా అవాంఛనీయ సం ఘటనలు జరిగిన వెంటనే ఆ సమాచారాన్ని నిర్ధారించుకుని తక్షణమే స్పందిం చడం గు రించి విద్యార్థులు, సిబ్బందిలో అవగాహన కల్పించడం లక్ష్యంగా ఇది సాగింది. ఆతిథ్య విభాగం-క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్ పర్యవేక్షణలో డైరెక్టర్ ఆఫ్ సె క్యూరిటీ సీనియర్ మేనేజర్ సంతోష్ కుమా ర్ యా దవ్ అడ్లా ఈ మాక్ డ్రిల్ కు నేతృ త్వం వ హించారు.

ఇందులో పలువురు సె క్యూరిటీ అధికారులు, పర్యవేక్షకులు, గార్డులతో పా టు వైద్య సిబ్బంది కూడా పాల్గొన్నా రు. ఇ లాంటి శిక్షణ, అవగాహన కార్యక్రమా లు క్రమం తప్పకుండా నిర్వహించి, భద్రతా సం స్కృతిని పెంపొందించడంలో బలమైన నిబద్ధతను ఈ మాక్ డ్రిల్ ఎంతో ఉపయో గపడిందని నిర్వాహకులు తెలిపారు.