09-09-2025 12:00:00 AM
- పేరుకు జిల్లా కేంద్ర ఆస్పత్రి
-అధికారుల మధ్య సమన్వయ లోపం రోగుల పాలిట శాపం
-గ్రూపుల కొట్లాట, సిబ్బందిలో కూడా గ్రూపులే
-సమన్వయ లోపం, రోగుల పాలిట శాపం
కామారెడ్డి, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి), పేరుకు జిల్లా కేంద్ర ఆస్పత్రి అయిన అందులో విధులు నిర్వహిస్తున్న అధికారుల మధ్య సమన్వయ లోపం రోగులపాలిట శాపం గా మారుతుంది. కనీసం రోగులను ఆస్పత్రిలో తీసుకెళ్లేందుకు కూడా సిబ్బంది పని చేయడం లేదంటే ఏ స్థాయిలో అధికారుల మధ్య కుమ్ములాటలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అధికారుల మధ్య ఉన్న కుమ్ములాటల మధ్య సిబ్బంది కూడా గ్రూపులుగా విడిపోయినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కొందరు అధికారులకు కొంతమంది సిబ్బంది వంత పాడుతున్నారు. దీంతో జిల్లా కేంద్ర ఆస్పత్రిలో అధి కారుల గ్రూపులు బట్టబయలవుతున్నాయి. సమన్వయంతో పనిచేసి రోగులకు వైద్య సేవలు అందించాల్సిన వైద్యులు ఉన్నతాధికారుల మధ్య గ్రూపు తగాదాలు చోటు చేసుకోవడం వల్లే రోగులకు సరైన వైద్యం అందడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. నిత్యం వందలాదిమంది గోపి రోగులు వచ్చి ఆసుపత్రికి లో చికిత్స చేయించుకుంటున్న సరిగా చికిత్సలు అందించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని రోగుల ఆరోపిస్తున్నారు.
గతంలో ఆసుపత్రి సూపర్డెంట్ గా పనిచేసిన వైద్యురాలిని ఆ అమాంతంగా సూపర్ డెంట్ గా తొలగించడం వల్లే వైద్యుల మధ్య, సిబ్బంది మధ్య గ్రూపులకు ఆజ్యము పోసినట్లు తెలుస్తుంది. గత కొన్ని ఎళ్లుగా జిల్లా ఆసుపత్రి సూపర్డెంట్ పనిచేసిన వైద్యురాలిని కొంతమంది వైద్యులకు పడకపోవడంతో పక్కా ప్రణాళికతో ఆమెను ఆసుపత్రి చూపెట్టండి పదవి నుంచి పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఆ వైద్యురాలు అను చరులు ఒక గ్రూపుగా ఏర్పడగా వ్యతిరేకంగా ఉన్న వైద్యుల గ్రూపు లుగా మారినట్లు తెలుస్తోంది.
దీనికి తోడు వైద్యుల గ్రూపులో అనువుగా సిబ్బంది గ్రూపులుగా మార డం వల్లనే ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య సేవలు అందడం లేదు. ఆస్పత్రిలో ముగ్గురు ఆర్‌ఎంవోలు ఉన్న వారిలో సక్యత లేనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆసుపత్రికి ప్రభుత్వం సూపర్డెంట్ గా ఉన్నతాధికారిని బదిలీపై పంపించడంతో ఇన్ని రోజులు తమ ఇష్టానుసారంగా వ్యవహరించిన వైద్యులకు మింగుడు పడడం లేద అని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పైకి అందరూ కలిసి ఉన్నట్లుగానే నటిస్తున్న లోలోపల మాత్రం గ్రూపుల పోరు కొనసాగుతున్నట్లు ఆస్పత్రి సిబ్బంది పేర్కొంటున్నారు. వారికి సిబ్బంది కూడా తోడవడంతో ఆసుపత్రికి వచ్చే రోగులకు సరైన వైద్య సేవలు పొందడం లేదు. ఇటీవల ఆసుపత్రికి వచ్చిన సూపర్డెంట్ ను పంపించేందుకు లోలోపల ప్రయత్నాలు జరగడమే కాకుండా అతడు వ్యవహరిస్తున్న తీరుపై వైద్యులు మనస్సు నడుచుకుంటున్నారు. పనిచేసిన వారిని, పనిచేయని వారిని ఓకే గాడిలో పెట్ట డం వల్లనే గ్రూపులకు ఆజ్యము పోసినట్లు తెలుస్తుంది. సోమవారం ఆస్పత్రికి వచ్చిన రోగులకు కనీసం సిబ్బంది వీల్ చైర్‌లో తీసుకొచ్చేందుకు కూడా అందుబాటులో లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇందుదకు నిదర్శనమని రోగులు ఆరోపిస్తున్నారు.
రోగులకు అందని సేవలు
కామారెడ్డి జిల్లాకు పెద్ద ఆసుపత్రిగా ఉన్న జిల్లా కేంద్ర ఆస్పత్రి రోగులకు వైద్య సేవలు సక్రమంగా అందడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. రాత్రి సమయంలో వచ్చే వారిని పట్టించుకునే వారు లేరని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం వేళలోనే రోగులను వీల్ చైర్లో లోనికి తీసుకెళ్లేందుకు సిబ్బంది లేదంటే రోగులకు వైద్య సేవలు ఏ మేరకు అందుతున్నా యో అర్థం చేసుకోవచ్చు.
నిక్కచ్చిగా వ్యవహరిస్తున్న..
కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తున్నాం. వైద్యులలో గ్రూప్ల తగాదాలు లేవు. వైద్యు లందరితో సమావేశాలు నిర్వహించి ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య సేవ లు అందిస్తున్నాం. మెడికల్ కళాశాల అధికారులు కూడా సేవలు అందిస్తున్నారు. రోగులకు వైద్య సేవలు అందడం లేదని తప్పుడు ప్రచారమే తప్ప సేవలు అందిస్తున్నాం. వీధుల్లో నిర్వహించాలని నిక్కచ్చిగా వైద్యులకు సిబ్బందికి సూచిస్తున్నాం. నిర్లక్ష్యం చేసేవారి పట్ల చర్యలు తీసుకుంటాం.
- పెరుగు వెంకటేశ్వరరావు, ఆసుపత్రి సూపర్డెంట్, కామారెడ్డి