calender_icon.png 11 October, 2025 | 9:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

11-10-2025 01:28:48 AM

  1. కలెక్టర్ బాదావత్ సంతోష్

అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ 

అచ్చంపేట, అక్టోబర్ 10: చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ సూచించారు. శుక్రవారం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసి చెంచు, గిరిజన ప్రాంతాల గర్భిణీ స్త్రీలకు అందించే సేవలపై ఆరా తీశారు. మందుల స్టాక్, వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్ పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఆలస్యంగా రావడం, డుమ్మా కొట్టే వైద్యులు, సిబ్బందిపై చర్యలుంటాయని హేచ్చరించారు. వైద్యసేవలు అందుతున్న తీరుపై, చికిత్స విధానం, ఔషధాల అందజేత, ల్యాబ్ టెస్టుల నిర్వహణ, వైద్యుల ప్రవర్తన వంటి అంశాలపై రోగుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి పరిసరాల్లో స్వచ్ఛత పాటించాలని ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన వైద్యం పొందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

చెంచు, గిరిజన పెంటల నుంచి ఆసుపత్రికి ప్రసవాలపై వచ్చే గర్భిణీ, శిశువుల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటిస్తున్న విధానాలపై కలెక్టర్ వైద్యులతో ఆరా తీశారు. గర్భిణీ స్త్రీలకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం, శిశు సంరక్షణలో పాటించాల్సిన ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. వారి వెంట అచ్చంపేట తహసిల్దార్ సైదులు, వైద్యులు ఇతర సిబ్బంది తదితరులుఉన్నారు.