24-04-2025 12:47:40 AM
నాగల్ గిద్ద, ఏప్రిల్ 23 : సంగారెడ్డి జిల్లా నాగల్ గిద్ద మండలం మోర్గీ మోడల్ పాఠశాల ప్రవేశ పరీక్షను 27వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ సువర్ణ బుదవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతిలో ప్రవేశాలకు 27 వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందని, 7వ తరగతి నుంచి 10వ తరగతిలో ప్రవేశాలకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు.
స్థానిక మోర్గి మోడల్ పాఠశాలలోనే ప్రవేశ పరీక్ష ఉందని అన్నారు. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు 21 నుంచి వెబ్ సైట్లో హాల్ టికెట్ అందుబాటులో ఉన్నాయని డౌన్లోడ్ చేసుకోవాలని మోడల్ పాఠశాల ప్రిన్సిపల్ సువర్ణ తెలిపారు. పరీక్షా కేంద్రానికి గంట ముందు చేరుకోవాలనిసూచించారు.