25-08-2025 12:55:18 AM
ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
హైదరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): రాష్ట్రంలోని పలు జిల్లా లో సోమవారం మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖ మ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షా లు పడే సూచనలున్నాయని తెలిపిం ది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చే సింది. మంగళవారం రాష్ర్టవ్యాప్తం గా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వ ర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ స్పష్టం చేసింది.