calender_icon.png 25 August, 2025 | 8:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదిలాబాద్‌లో కార్డెన్ అండ్ సెర్చ్

25-08-2025 12:55:28 AM

పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనాలు, గంజాయి మొక్కల స్వాధీనం

ఆదిలాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): ప్రజల రక్షణ, సంరక్షణ సక్రమంగా నిర్వహించడానికి కమ్యూనిటీ కాంటాక్ట్ (కార్డెన్ అండ్ సెర్చ్)లను నిర్వహించడం జరుగుతుందని ఆదిలాబాద్ డిఎస్పీ జీవన్‌రెడ్డి తెలిపారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేర కు ఆదివారం తెల్లవారుజామున స్థానిక కేఆర్కే కాలనీలో డిఎస్పీ ఆధ్వర్యంలో దాదా పు 200 మంది పోలీసులతో కార్డెన్ అండ్ సెర్చ్(ఇంటింటి సోదాలు) నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 70 ద్విచక్ర వాహనాలు, 16 ఆటోలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. 

అదేవిధంగా నార్కోటిక్ డాగ్ రోమా సహాయంతో గంజాయి కోసం తనిఖీ చేయగా ఒక ఇంట్లో మూడు గంజాయి మొక్కలు, 10 గ్రాముల ఎండు గంజాయి లభించిందని డీఎస్పీ తెలిపారు. అదేవిధంగా షాపుల్లో తనిఖీ చేయగా 29 క్వార్టర్ లిక్కర్ బాటిల్స్ లభ్యమైనట్టు తెలిపారు.  రానున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. కాలనీలలో కొత్తవారికి అద్దె ఇచ్చే సమయంలో సరైన ఎంక్వయిరీ చేసుకుని ఇవ్వాలని సూ చించారు. ఈ కార్యక్రమంలో సీఐలు కర్ర స్వామి, సునీల్‌కుమార్, నాగరాజు, ఫణిదర్, ప్రేమ్‌కుమార్, రిజర్వ్ ఇన్స్‌పెక్టర్లు వెంకటి, మురళి,  చంద్రశేఖర్, ఎస్‌ఐలు, పలు విభా గాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.