25-08-2025 12:54:25 AM
1.50 లక్షల విలువైన వెండి నగల అపహరణ
కాగజ్‌నగర్, ఆగస్టు24 (విజయక్రాంతి): కాగజ్ నగర్ పట్టణంలోని శ్రీ బ్రహ్మానందం జువెలరీ షాప్ లో నలుగురు గుర్తుతెలియని మహిళలు నగలు కొనుగోలు చేసేందుకు వచ్చి 1.50లక్షల రూపాయల వెండి ఆభరణాలను పట్టపగలే చోరీచేసిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది.
ఆభరణాలను కొనుగోలు చేస్తామని చెప్పి వాటిని పరిశీలించి యజమాని కండ్లుగప్పి నగలను అపహరించారు.షాపు యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న టౌన్ సిఐ ప్రేమ్ కుమార్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.సిసి టీవీ పుటేజీలను సేకరించారు.యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.