27-07-2025 06:13:52 PM
మేడిపల్లి: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్(Peerzadiguda Municipal Corporation) పరిధిలోని మేడిపల్లి శ్రీ సాయి నగర్ కాలనీ(ఈస్ట్) నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యవర్గ ఏర్పాటు కోసం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా అధ్యక్షుడిగా కృష్ణకాంత్ ప్రధాన కార్యదర్శిగా సంపత్ కుమార్ గౌడ్ కోశాధికారిగా యాకుబ్ రెడ్డి సంయుక్త కార్యదర్షులుగ శ్రీనివాస్, సత్యనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్షులుగా కోటేశ్వరరావు, మధు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా ఉపాధ్యక్ష పదవి కోసం జహంగీర్, స్వామి నాయక్ ఇద్దరు పోటీలో ఉండగా స్వామి నాయక్ ఎన్నికయ్యారు. నూతన కమిటీ ప్రతినిధులకు నియామక పత్రాలు అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈసందర్భంగా కాలనీవాసులు నూతన ప్రతినిధులను సన్మానించారు.