calender_icon.png 7 July, 2025 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకు మోదీ చేసిందేమీ లేదు

07-07-2025 01:05:57 AM

- 15న కర్ణాటకలో కాంగ్రెస్ సీనియర్లతో ఓబీసీ సమావేశం 

- కవిత రైల్ రోకో ఎందుకు చేస్తానంటుందో అర్థం కావడం లేదు 

- మేం 42 శాతం రిజర్వేషన్లు అమలుపై తీర్మానం చేసినం 

- పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు 

హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): పదకొండేళ్ల బీజేపీ పాల నలో ప్రధాని నరేంద్రమోదీ బీసీలకు చేసిందేమిటో చెప్పాలని పీసీసీ మా జీ అధ్యక్షుడు వి. హనుమంతరావు డిమాండ్ చేశారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని బీసీ అని చెప్పుకునే మోదీని మూడుసార్లు కలిసి కోరామని, ఆ యన నుంచి ఎలాంటి స్పందన లేద ని విమర్శించారు.

ఆదివారం ఆయ న గాంధీభవన్‌లో మీడియాతో మా ట్లాడుతూ ఓబీసీలను రాజకీయంగా, ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు ఈ నెల 15న కర్నాటక సీఎం సిద్ధరామయ్య సీనియర్ కాంగ్రెస్ నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారని తెలిపారు. కర్నాటక సీఎం ఆహ్వానం మేరకు తాను ఓబీసీ సమావేశానికి వెళ్లనున్నట్లు వీహెచ్ పేర్కొన్నారు.

బీసీల రిజర్వేషన్ల కోసం ఎమ్మెల్సీ కవిత రైలు రోకో ఎందుకు చేస్తామంటుందో అర్థం కావడం లేదన్నారు. రాహుల్‌గాంధీ ఆలోచన మేరకు రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి కులగణన చేయడం, విద్యా, ఉద్యోగ రం గాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్ర భుత్వానికి పంపిన విషయం తెలియ దా అని వీహెచ్ నిలదీశారు.

తమ ప్ర భుత్వం 42 శాతం రిజర్వేషన్లు అమ లు చేయకపోతే రైల్‌రోకో చేస్తే బా గుంటుందన్నారు. సామాజిక న్యా య సమరభేరి సభ విజయవంతమైందన్నారు. ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న నిజమైన కార్యకర్తలకు పదవులు ఇవ్వాలని పీఏసీలో కోరినట్లు ఆయన చెప్పా రు. గత బీఆర్‌ఎస్ హయంలో పార్టీ కార్యకర్తలపై పెట్టిన కేసులను కూడా ప్రభుత్వం ఎత్తివేయాలని కోరినట్లు ఆయన పేర్కొన్నారు.