07-07-2025 01:06:21 AM
భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావుకి
ఎస్‌ఎఫ్‌ఐ బృందం వినతి పత్రం
భద్రాచలం, జూలై 6 (విజయక్రాంతి): భారత విద్యార్థి ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండిం గ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెం ట్ అలాగే బెస్ట్ అవైలబుల్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని భద్రాచలం నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం . వెంకట్ రావు కి ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు కొప్పుల రవీందర్ నాయకత్వంలో ఆదివారం వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు సానుకూలంగా స్పందిస్తూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూస్తానని అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమం అనంతర ఈసందర్భంగా యస్. భూపేందర్, జిల్లా ఉపాధ్యక్షులు కొప్పుల రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత ఆరు సంవత్సరాల నుండి రూ 8,158 కోట్ల పెం డింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ , స్కాలర్షిప్స్ విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు.
విద్యార్థుల దగ్గర నుండి కాలేజ్ యాజమాన్యాలు బలవంతంగా ఫీజులు కట్టాల ని విద్యార్థులను వారి తల్లిదండ్రులను వేధిస్తూ పెండింగ్ ఫీజులను బలవంతపు వసూలు చేస్తున్నారని అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని విద్యార్థుల సమస్యలను గాలికి వదిలేసిందని రాష్ట్ర ప్రభుత్వానికి విద్యారంగం మీద ఏమాత్రం ప్రేమ లేదని వారు అ న్నారు.
రాష్ట్రంలో 13 లక్షల మంది బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు పై చదువులకు వెళ్లాలంటే సర్టిఫికెట్ల కోసం కాలేజ్ చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని కొన్ని కళాశాలలో ముక్కు పిండి మరి వసూలు చేస్తున్నారని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఫీజు బకాయిలు విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తున్న ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రినీ నియమించటకపోవడం సిగ్గుచేటని అలాగే విద్యారంగంలో అనేక సమస్యలతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విద్యారంగా సమస్యలు పరిష్కారం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రవీందర్,చందు వర్ధన్, దేవ, తదితరులు పాల్గొన్నారు.