calender_icon.png 7 July, 2025 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

07-07-2025 01:04:33 AM

పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 

మణుగూరు, జూలై 6 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాల అమలు తోపా టు, గ్రామాల సమగ్ర అభివృద్ధే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, పినపాక ఎమ్మె ల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు.ఆదివారం మండలంలోని సమితి సింగారం, గుట్ట మల్లారం పంచాయతీలలో రూ.1 కోటి అంచనా వ్యయంతో నిర్మించనున్న పలు సీసీ రోడ్లకు, పలు అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ చేసి,శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మారుమూల గ్రామాలు, పంచాయితీలు ఎంతో అ భివృద్ధి చెందాయన్నారు. ప్రజల ప్రతి అవసరాన్ని తీర్చడమే ద్యేయంగా ముందుకెళ్తున్నామని, సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్క పేద ప్రజలకు అందించేలా చూస్తానన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ప్రజల భాగస్వామ్యంతో ప్రజా ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేస్తుందని తెలిపారు.

అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్ర భుత్వం కృషి చేస్తుందన్నారు. సదరు గుత్తేదారు లు నాణ్యతతో కూడిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, నాణ్యతలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తెల్లూరి శ్రీనివాసరావు, మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పిరినాకి నవీన్ , శివ సైదులు , యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తరుణ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.