08-09-2025 01:08:31 AM
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎంత సాదాసీదాగా ఉంటా డో అనేక సందర్భాల్లో రుజువైంది. పార్లమెంట్ ప్రాంగణంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో ఆదివారం జరిగిన బీజేపీ ఎంపీల వర్క్‌షాప్ (సంసద్ కార్యశాల)లో కూడా మరోసారి తన నిరాడంబరతను చాటుకున్నారు. తోటి పార్లమెంట్ సభ్యులతో కలిసి ఆయన చివరి వరుసలో కూర్చు న్నారు. జీఎస్టీ విధానంలో చేసిన కీలక సంస్కరణలపై ఈ సమావేశం జరిగింది.
జీఎస్టీ సంస్కరణలకు మద్దతుగా బీజేపీ ఎంపీలందరూ తీర్మానాన్ని ఆమోదించారు. సెప్టెంబర్ 3న జీఎస్టీ కౌన్సిల్ జీఎస్టీ స్లాబులను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. నేడు ఉపరా ష్ట్రపతి ఎన్నికల కోసం ఎంపీలను సంసిద్ధం చేయనున్నారు. ఎన్నికల ప్రక్రియ గురించి వారికి వివరించనున్నారు. గోరఖ్‌పూర్ ఎం పీ, బీజేపీ నేత రవికిషన్ ఈ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.