calender_icon.png 15 August, 2025 | 1:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లి రోడ్లపై పశువుల సంచారం..!

14-08-2025 11:23:46 PM

వాహనాల రాకపోకలకు నిత్యం ఇబ్బందులే..

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి(Bellampalle) పట్టణంలోని ప్రధాన రోడ్లపై పశువుల సంచారంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రతినిత్యం ఇరుకుగా ఉన్న రహదారులపై ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతుంటే పశువుల సంచారం మరింత తలనొప్పిగా తయారయింది. పట్టణంలోని నెంబర్ 2 గ్రౌండ్, కాంటా చౌరస్తా, పాత బస్టాండ్ ప్రాంతాల్లో రాత్రి రహదారులపై ఆవులు, గేదెలు విచ్చలవిడిగా సంచరిస్తున్న సంబంధిత అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు తప్ప చర్యలు తీసుకోవడం లేదు. రాత్రి సమయాల్లో రోడ్లమీద ఆవులు, గేదెలు పడుకొని ఉండటం వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. పశువుల సంచారం వల్ల పండుగలు, ప్రత్యేక దినాల్లో బెల్లంపల్లి రోడ్లపై ట్రాఫిక్ సమస్య మరింత జటిలంగా మారుతుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు రోడ్లపై పశువుల సంచారాన్ని అరికట్టాలని బెల్లంపల్లి ప్రజలు కోరుతున్నారు.