calender_icon.png 15 August, 2025 | 1:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముఖ్యమంత్రి వ్యాఖ్యలను వక్రీకరించడం అవివేకమే..!

14-08-2025 10:49:31 PM

- స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి..

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): విలువలతో కూడిన జర్నలిజం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కొంతమంది వక్రీకరించి వారి స్వార్థ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని అది ముమ్మాటికీ వారి అవివేకమేనని స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి(MLA Kuchukulla Rajesh Reddy) అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో అధ్యక్షులు వెంకటస్వామి అధ్యక్షతన ఏర్పాటు చేసిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్(ఐజేయు) అనుబంధ ఎలక్ట్రానిక్ మీడియా కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వాలకు ప్రజలకు వారదులుగా అపారమైన అనుభవం గల సీనియర్ పాత్రికేయులు జర్నలిజంపైనే ఆధారపడి ప్రజా శ్రేయస్సుకు పాటుపడుతున్న జర్నలిస్టులను కీర్తిస్తూ తప్పుడు రాతలు రాసే మిగతా జర్నలిస్టుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని మరోసారి గుర్తు చేశారు.

కానీ కొంత మంది అవకాశవాదులు దానిని వక్రీకరించి జర్నలిజంపైన తప్పుగా మాట్లాడినట్టు ప్రచారం చేసుకుని పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. అన్ని విభాగాల్లోనూ సీనియర్లను జూనియర్లు గౌరవిస్తారని అదే మాదిరి జర్నలిజంలోను సీనియర్లను గుర్తించడం లేదన్న విషయాన్ని మాత్రమే ప్రస్తావించారని పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతోనే ఉందని అందుకు నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో తన సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. ప్రింట్ మీడియా జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్, కార్యదర్శి సురేష్, ప్రభాకర్, సంఘం రాష్ట్ర నాయకులు కర్ణయ్య, శ్యాం, సీనియర్ జర్నలిస్టులు కందికొండ మోహన్, దినకర్, విజయ్ కుమార్, పాదం వెంకట్ తదితరులు పాల్గొన్నారు.