calender_icon.png 15 August, 2025 | 1:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాలలో మళ్లీ మొదటికి వచ్చిన మైక్రో ఫైనాన్స్ ఆగడాలు

14-08-2025 11:02:01 PM

అడ్డుకట్ట వేసి ఆదుకోవాలని టిఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షలు రణపంగ శ్రవణ్ డిమాండ్

పెన్ పహాడ్: మైక్రో ఫైనాన్స్ ఆగడాలకు నిరుపేద కుటుంబాలు ఆగం కావడంతో గత ప్రభుత్వం, న్యాయస్థానాలు తీసుకున్న నిర్ణయాలకు కొన్ని సంవత్సరాల పాటు కంటికి కనిపించకుండా పోయాయని.. నేడు అవే సంస్థలు పేర్లు మార్చుకొని ప్రైవేటు బ్యాంక్ లు, ఫైనాన్స్ ల పేరుతో తిరిగి గ్రామాలలోకి అడుగు పెట్టడంతో వారి ఆగడాలకు అడ్డు.. అదుపు లేకుండా పోయాయని టిఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రణపంగ శ్రవణ్(TMSF State President Ranapanga Shravan) ఆరోపించారు.

గురువారం మండల కేంద్రంలో విలేకర్లతో మాట్లాడుతూ.. మండలంలో ఆయా గ్రామాల పేద మధ్య తరగతి ఎస్సీ, ఎస్స్టీ, బీసీ కులాల అవసరాలను ఆసరాగా చేసుకొని పలు మైక్రో ఫైనాన్స్ సిబ్బంది గ్రామాలల్లో మధ్యవర్తుల ద్వారా మహిళలుకు డబ్బు ఆశ చూపించి రోజువారీ కూలి చేసుకునే వారిని ఒక గ్రూప్ ఏర్పాటు చేసి కమిషన్, ఇన్సూరెన్స్, డాక్మేంటేషన్ పేరు మీద ముందస్తుగానే వేల రూపాయలు కట్ చేసుకుంటారని అన్నారు. మిగతా రూపాయలు బెన్ఫిషర్ కు ఇచ్చి ప్రతి నెల 4 నుండి 10వ తారీఖు లోపు కట్టాలను ఆదేశించి ఒకవేళ చెల్లించకపోతే సిబిల్ స్కోర్ తగ్గుతుందని ఫ్యామిలీలో పిల్లలకు కూడా నోటీసులు వస్తాయని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూపులో ఒకరు కట్టకున్నా మిగితా సభ్యులపై మానసిక వత్తిడి తెస్తూ అసభ్య పదజాలాలంతో బెదిరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా మైక్రో ఫైనాన్స్ ఆగడాలపై చర్యలు తీసుకొని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడ్డీలేని రుణాలు అందించి పేద ప్రజలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.