calender_icon.png 15 August, 2025 | 1:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశం కోసం ప్రాణాలర్పించిన నేత రాజీవ్ గాంధీ

14-08-2025 11:06:49 PM

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు..

కామారెడ్డి అర్బన్ (విజయక్రాంతి): దేశం కోసం ప్రాణాలర్పించిన నేత రాజీవ్ గాంధీ అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు(District Congress Committee President Kailas Srinivasa Rao) అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లాకు వచ్చిన రాజీవ్ గాంధీ సద్భావన జ్యోతి యాత్రకు స్వాగతం పలికారు. రాజీవ్‌గాంధీ సద్భావన జ్యోతి యాత్రకు కైలాస్ శ్రీనివాస్ రావు, మహమ్మద్ ఇలియాస్ ఘన స్వాగతం పలికారు. సిరిసిల్ల బైపాస్ రోడ్డు నుండి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం వరకు రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా  యాత్ర కాగడను అందుకొని, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ... దేశం కోసం ప్రాణాలర్పించిన గొప్ప నేత రాజీవ్‌ గాంధీ అని అన్నారు. రాజీవ్‌ హయాంలోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. దేశం సంఘటితం కోసం కృషి చేశారని కొనియాడారు. 

యువతకు 18 సంవత్సరాల్లోనే ఓటు హక్కు కల్పించడంలో ప్రత్యేక పాత్ర పోషించారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం, టెలికమ్యూనికేషన్స్, కంప్యూటర్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం వంటివి రాజీవ్ గాంధీ దూరదృష్టికి నిదర్శనమని పేర్కొన్నారు. నేటి యువతరం ఆయన ఆశయాలను, సిద్ధాంతాలను స్ఫూర్తిగా తీసుకోవాలని, దేశ పురోగతికి పాటుపడాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం శ్రీనివాస్ రెడ్డి, భీమ్ రెడ్డి, సుతారి రమేష్, నౌసిలాల్, జనగామ రాజు, రాజా గౌడ్, గుడుగుల శ్రీనివాస్, ఐరేని సందీప్, సిరాజుద్దీన్, కన్నయ్య, గోనే శ్రీనివాస్, తేజ ప్రసాద్, సిద్ధిక్, అజ్మత్, ప్రసన్న, రవీందర్ గౌడ్, లడ్డు, బట్టు మోహన్, జొన్నల నర్సింలు, అతిక్, ఖదీర్, శంకర్, హోసన్న, ప్రవీణ్ కుమార్, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.