calender_icon.png 15 August, 2025 | 1:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణకు శ్రీరామరక్ష బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్

14-08-2025 11:28:18 PM

అబద్దాలు ప్రచారం చేయటంలో కాంగ్రెస్ యూనివర్సిటీ గొప్పది..

పట్టణానికి పరిమితమైన భద్రాచలం ఎమ్మెల్యే..

ఎక్కడ చూసినా ఫుడ్ పాయిజన్లో.. విద్యార్థుల కన్నీళ్లే..

బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు..

భద్రాచలం (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అని ఆ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, మాజీ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు(Former government whip Rega Kanta Rao) అన్నారు. గురువారం స్థానిక రాఘవ నిలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్ పార్టీ యూనివర్సిటీ గొప్పదని విమర్శించారు. భద్రాచలం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు పట్టణానికి పరిమితమయ్యారని, పట్టణంలో ఉంటే నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లో నెలకొన్న సమస్యలు ఎలా కనపడతాయని ప్రశ్నించారు. భద్రాచలం నుంచి వెంకటాపురం వరకు ఇసుక లారీల వలన రోడ్డు ధ్వంసం అవుతుంటే స్థానిక ఎమ్మెల్యే కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని దుయ్యబట్టారు. భద్రాచలం అభివృద్ధి మా ప్రభుత్వంలో గోదావరి కరకట్ట పటిష్టతకు నిధులు కేటాయించామని, భద్రాచలం నియోజకవర్గానికి ఎమ్మెల్యే తెచ్చిందేమిటో చెప్పాలన్నారు.

ఆరు గారెంటీల పేరుతో 120 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి ప్రభుత్వం ఒక్కటి కూడా సవ్యంగా అమలు చేయని లేకపోయిందని విమర్శించారు. ప్రజలను, విద్యార్థులను, వెనుకబడిన వర్గాలను మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ ముక్కు నేలకు రాసి సబ్బండ వర్గాల ప్రజలను క్షమాపన అడగాలని డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో ఎక్కడ చూసిన గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు ఆసుపత్రుల పాలు అయ్యారన్న వార్తలు వస్తున్నాయని. ప్రభుత్వం ఏర్పడి అనేక నెలలు గడుస్తున్న నేటికి ఒక విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం ఒక రేవంత్రెడ్డి సర్కారుకే సాధ్యమైందని అన్నారు. భద్రాచలం నియోజకవర్గంలో తాలిపేరు ఎడమ కాలువ గండిపడి ఆఖరి ఆయకట్టవరకూ నీరు అందడం లేదని, పంటలకు నీరు ఇచ్చే దిక్కులేదు కాంగ్రెస్ ప్రభుత్వం లోని దుయ్యబట్టారు.

భద్రాచలం పట్టణ అభివృద్ధికి ఆనాడు కరకట్ట, సెంట్రల్ లైటింగ్ నిర్మాణంకు నిధులు కేటాయించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, వేసిన శిలాఫలకాల పక్కన శిలాఫలకాలు వేసి, మేమే చేస్తున్నామని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. కరకట్ట రిటైలింగ్ వాల్ కూలి పోతే పట్టించుకునే దిక్కులేదని తెలిపారు. పాత్రికేయ సమావేశంలో నియోజకవర్గ పార్టీ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానే రామకృష్ణ, భద్రాచలం మండల పార్టీ కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్, కో కన్వీనర్ రేపాక పూర్ణచంద్రరావు, సీనియర్ నాయకులు కొల్లం ప్రేమ్ కుమార్, మహిళా విభాగం అధ్యక్షురాలు సీతామహాలక్షిమి, దుమ్ముగూడెం మండల నాయకులు రావులపల్లి పృథ్వి, యువజన నాయకులు కీసర యువరాజు, సోషల్ మీడియా అధ్యక్షులు ఇమంది నాగేశ్వరరావు, కిసాన్ సెల్ అధ్యక్షులు అయినాల రామకృష్ణ, ఆటో యూనియన్ అధ్యక్షులు రావూరి రవి కిరణ్, తూతిక ప్రకాష్, మణుగూరు మండల కో కన్వీనర్ నూకారపు రమేష్, ప్రభు కుమార్ తదితరులు ఉన్నారు.